YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఆమంటే అందానికే అసుయా

Highlights

  • ఆమెను తెలుగింటి ఆడపడుచు
  • అపురూప సౌందర్యరాశి
ఆమంటే అందానికే  అసుయా

 అందానికి అభినయాన్ని జోడించి  వెండి తెరను ఐదు దశాబ్ధాల పాటు ఏలిన  మకుటం లేని  మహరాణి శ్రీదేవి.భారతీయ సినీ రంగంలో విరబూసిన పారిజాతం శ్రీదేవి.అందం ఆమెను చూస్తే కుళ్లు కుంటుంది. చందమామ సైతం పక్కకు తప్పుకుంటుంది. అభిమానులకే కాదు తోటి నటీనటులకు కూడా శ్రీదేవి రోల్‌మోడల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనకే నాట్యం నేర్పిన నాట్య మయూరి... దిగివచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి. ఇలా ఎంత చెప్పినా ఈ భూలోక సుందరి  గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘పూలరెక్కలు. కొన్ని తేనె చుక్కలు. రంగరిస్తవో..ఇలా బొమ్మ చేస్తివో. అసలు భూలోకం  ఇలాంటి సిరి చూసి ఉంటదా. కనక ఈ చిత్రం   స్వర్గానికి చెంది ఉంటదా?’ ఇదీ శ్రీదేవిపై రాసిన పాట. బహుశా  ఓ భాషలోనూ శ్రీదేవికి దక్కినంత ఈ తరహా గౌరవం ఇంకెవరికి  దక్కి ఉండదు. టాలీవుడ్, బాలీవుడ్ లకు వచ్చేసరికి 80, 90 దశకాల్లో శ్రీదేవి ఓ అపురూప సౌందర్యరాశి. హీరోలను కూడా పక్కన పెట్టి శ్రీదేవి కోసమే అప్పట్లో యూత్ సినిమాలు చూసేవారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. 
 ఏ తరాన్నైనా మెప్పించి మైమరపించగల అందం శ్రీదేవిది.ఆమె పుట్టింది తమిళనాడులోనైనా తెలుగు ప్రేక్షకులకు ఆమె ఆరాధ్య దేవతైంది. ఆమెను తెలుగింటి ఆడపడుచుగానే ఆరాధించారు. తమ కలల రాణిగా శ్రీదేవిని పూజించారు. ఒకానొక దశలో శ్రీదేవి. లేని సినిమా లేదు...ఆమె లేని చిత్రాన్ని కూడా అభిమానులు ఊహించుకోలేకపోయారు. అంతలా అందరిని తబ్బిబ్బు చేసింది శ్రీదేవి రెండు తరాలతో నటించి నెంబర్ వన్ స్థానంలో నిలబడటం కథానాయకులకే సాధ్యం అన్న ఒరవడిని బ్రేక్‌ చేసింది శ్రీదేవి. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు రెండు తరాలతో నటించగలరని నిరూపించింది.  అలా నటించి  అందరి మన్ననలు అందుకుంది ఈ సౌందర్య రాశి. అభిమానులకే కాదు తోటి నటీనటులకు కూడా శ్రీదేవి నటన ఆదర్శప్రాయమనడంలో ఎలాంటి సందేహం లేదు సుమా.. 

Related Posts