యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిన్న జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సదస్సులో అంబటి రాంబాబుగారు, శ్రీ కృష్ణ దేవరాయలు గారు, గుబ్బా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు అన్ని రకాలు అండదండలుగా ఉంటామని స్పష్టమైన హామీ ఇవ్వడమే కాక సత్తనెపల్లి ఆర్యవైశ్య వైసీపీ నాయకులకు రాజకీయంగా సముచిత స్థానాన్ని కలిపిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సభలో వెలుగూరి శరత్ బాబు గారు మాట్లాడుతూ గత 6 దశాబ్దాలుగా కాపులు ఆర్య వైశ్యులకు అన్ని ఎన్నికలలో అండగా ఉన్నారని, ముఖ్యంగా వైశ్య నాయకులు వెలుగూరి వెంకటేశ్వరులు గారికి, వెలుగూరి జయకుమార్ గారికి పూర్తి సహకారం ఇచ్చారని అయన అన్నారు. అటువంటి కాపులకు వైశ్య సోదర సోదరీమణులందరు ఓటు వేసి ఋణం తీర్చుకోవలసినదిగా శరత్ బాబు కోరారు. ఈ విజ్ఞప్తికి ఆర్యవైశ్య సోదరసోదరీమణులు స్పందించి అంబటి రాంబాబు గారిని, శ్రీ కృష్ణ దేవరాయలు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని హర్షధ్వనులు మధ్య ప్రకటించారు. ఈ సభలో చలంచర్ల సాంబశివరావు గారు, ఆతుకూరి నాగేశ్వరరావు గారు, అభ్యత శివప్రసాద్ గారు, పొత్తూరి దుర్గారావు గారు, కొత్త రామకృష్ణ గారు, గుంటూరు సుషేంద్ర గారు,తల్లం సతీష్ గారు, కొత్త లక్ష్మయ్య గారు, బావింశెట్టి సుబ్రహ్మణ్యం గారు, దేవశెట్టి రవి గారు, కూకట్ల శ్రీను గారు, జానకి రామారావు గారు, పొత్తూరి హరీష్ రావు గారు, ఆకులోడు దుర్గారావు గారు, దడ్ల రాంబాబు గారు, కొత్తూరి విశ్వేశ్వరరావుగారు, అన్నం రామారావుగారు తదిరలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కొణిజేటి రోశయ్య గారి మనవడు మౌర్య గారు పాల్గొని జగన్ సీఎం అవ్వాలని కోరారు.