యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనపై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ విమర్శలు గుప్పించారు. ఆయన్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందన్నారు. అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానిలో సచివాలయానికి పర్మినెంట్ భవనం కట్టలేని చంద్రబాబు హైదరాబాద్‌లో మాత్రం శాశ్వత ఇల్లు కట్టుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి హెచ్చుమీరిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి అని వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదు. చంద్రబాబు హయాంలో గొప్పలు తప్ప రాష్ర్టాభివృద్ధి జరగలేదని విమర్శించారు. అమరావతిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2014లో గెలిస్తే మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపై పెడతామని చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. మహిళలకు రుణమాఫీ చేసే ఉద్దేశం లేదని మంత్రి పరిటాల సునీత చెప్పారు. అ ఆ లు కూడా రానివాడికి అగ్రతాంబూలం అన్నట్టు లోకేష్ తీరు ఉంది. కేటీఆర్‌లా లోకేశ్ గొప్ప ఐటీ కంపెనీలు తేలేదు. ఈ ఎన్నికలు కేసీఆర్, చంద్రబాబు మధ్య పోటీ ఎలా అవుతాయి. ఈ రాజకీయ సినిమాలో పవన్ యాక్టర్, చంద్రబాబు డైరెక్టర్. చంద్రబాబు చెప్పిందే పవన్ కల్యాణ్ చేస్తున్నాడు. డేటా చోరీపై పవన్ ఎందుకు మాట్లాడలేదు. పవన్ నామినేషన్‌కు టీడీపీ క్యాడర్ వెళ్తుంది. పవన్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే. చంద్రబాబుకు జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య ఎంత తేడా ఉందో ఆలోచించండి. 9 ఏళ్లుగా జగనన్న విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు. పదవుల కన్నా విశ్వసనీయతే ముఖ్యమని జగన్ అనుకున్నారు. 9ఏళ్లు ప్రజల కోసం పోరాడిన జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.అని షర్మిల కోరారు.