YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

అమితాబ్‌ సిక్స్త్ సెన్స్

Highlights

  • శనివారం రాత్రి ఒంటిగంటకు
  • మనసులో ఏదో అలజడి
  • ట్విట్టర్ ట్వీట్ చేసిన అమితాబ్
  • శ్రీదేవి అకాలమరణమ్ పై స్పందన 
అమితాబ్‌ సిక్స్త్ సెన్స్

 మహానటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శనివారం రాత్రి ఒంటిగంటకు అమితాబ్ తొలుత దక్షిణాఫ్రికాతో టీ - 20లో భారత్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. తరువాత 1.13 నిముషాలకు ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. చివరిగా 1.15 నిముషాలకు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దానిలో ‘ఎందుకోగానీ, నా మనసులో ఏదో అలజడి చెలరేగుతోంది’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు అమితాబ్‌కు శ్రీదేవి మరణం ముందే తెలుసా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పని చేసిందని అందుకే ఇలా ట్వీట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.అందాల రాశి శ్రీదేవి కన్నుమూసింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆమె మృతి చెందింది. ఈ వార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్లందరూ ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు

Related Posts