YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబాయిను చంపించింది జగనే : నారా రోహిత్

బాబాయిను చంపించింది జగనే  : నారా రోహిత్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కోర్టులు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ.. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించొద్దని జగన్‌కు ఇన్ డైరెక్ట్‌ కౌంటర్ ఇచ్చారు నారా రామ్మూర్తినాయుడు కొడుకు, సినీ హీరో నారా రోహిత్. చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తినాయుడు రాజీకీయంగా ఎదగకుండా చేశారని.. ఆయన్ని పట్టించుకోకుండా చేశారంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ.. ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ లేఖలో నారా రోహిత్ ఏమన్నారంటే.. ‘నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌గా మార్చడంలో ముఖ్యమంత్రివర్యులు, మా పెద్దనాన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, మా నాన్న రామ్మూర్తినాయుడు మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించొచ్చు. నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. కనుకనే మేమంతా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై, మా మధ్య ఉన్న బంధంపై బురద చల్లకండి. నాలుగు దశాబ్ధాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలకు, పంచాయతీ భవనాలకు ఇచ్చామనే విషయాన్ని మరిచిపోకండి. మాకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం, అసత్యం. రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా చూసుకుంటున్నారో.. మమ్మల్ని అదే విధంగా చూసుకుంటున్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయి మీదనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అటువంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ? ప్రతి సంవత్సరం మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా గడుపుతున్నారు. మా అందరికీ ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుకనే ఆయన ఇంటికే పరిమితమయ్యారు’ అంటూ జగన్ పేరును ప్రస్తావించకుండా ఘాటుగా స్పందించారు నారా రోహిత్.

Related Posts