యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కుక్క తోక పట్టుకుని గోదావరి నది ని ఈదలేమని, వైకాపా కోడి కత్తి పార్టీకి ఓటేసి రాష్ట్ర ప్రగతి ని సాధించలేమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు సోమవారం నాడు తుమ్మలపాలెం, ఈలప్రోలు గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఉత్సాహ భరితంగా ప్రసంగించారు. పలుచోట్ల వేలాదిమంది గా వచ్చిన ప్రజలను ఉద్దేశించి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గణాంకాలతో వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపాదన కొట్టేశాడని, తత్ఫలితంగా 31 కేసులో ముద్దాయిగా ఉన్నారని ఆరోపించారు. మైలవరం కోడి కత్తి పార్టీ అభ్యర్థి గచ్చిబౌలి భూముల్ని కొట్టేసి, సిబిఐ ఈడీ కేసుల్లో తొమ్మిదో ముద్దాయిగా ఉన్నట్లు విమర్శించారు. అధికారంలోకి రాకుండా నే ప్రభుత్వ ఆస్తులు కొట్టేసిన దొంగలకు ఓట్లు వేస్తారా ? ప్రజల రాజధాని అమరావతి ఆంధ్రుల జీవన పోలవరం కట్టిన చంద్రబాబుకు ఓటేస్తారా ? అని ఆయన ప్రజల్ని ప్రశ్నించారు. కేంద్రంలో ఉండి ప్రధాని మోదీ సహకరించకపోయినా, రాష్ట్ర ప్రగతి కి అడుగడుగునా అడ్డు చక్రాలు వేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. సంపద కలిగిన తెలంగాణ రాష్ట్రంలో లో లక్ష రూపాయల రుణమాఫీ జరిగితే, విభజన లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీలో లో చంద్రబాబు నాయుడు రైతుకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో అన్న మాట ప్రకారం 24 వేల 500 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. కృష్ణా నదిపై అంతర్జాతీయ ఐకానిక్ బ్రిడ్జి, దాములూరు - వైకుంటపురం బ్యారేజీ నిర్మాణాలతో మైలవరం ప్రగతి రేఖలు పూర్తిగా మారతాయని చెప్పారు. తాను మైలవరం ప్రజలకు సేవ చేయడానికి సిద్ధపడి వచ్చినట్లు, కులాలు మతాలు ప్రాంతాలు రాజకీయ విభేదాలు తనకు ఎప్పుడూ లేవని తెలిపారు. మైలవరంలో లో కులాలు రాజకీయాలకు అతీతంగానే అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. మైలవరం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి మాత్రమేనని, అభివృద్ధిని చేసి ఓట్లు అడగటం తనకు తెలిసిన రాజకీయమని తెలిపారు. ప్రజలకిచ్చిన మాటను హామీని తానెప్పుడూ మర్చిపోనని చెప్పిన పనులతో పాటు చెప్పని పనులను కూడా మహిళ వారంలో చేసి చూపినట్లు మంత్రి ఉమా పేర్కొన్నారు. మంత్రి ఉమా పర్యటన సందర్భంగా ఈలప్రోలు తుమ్మలపాలెం గ్రామాలలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈలప్రోలులో మాగాణి పొలాల్లోకి దిగి మంత్రి ఉమా వరి పంటను పరిశీలించారు సాగునీటి పరిస్థితి గురించి అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు