యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
2019 ఎలెక్షన్స్ నామినేషన్లు పర్వము కూడా పూర్తి అవ్వుతుంది,ఇక ప్రచారానికి మాత్రం రెండు వారలే సుమయం ఉంది,ఇరు పార్టీ నేతలు ఓటర్లును ప్రసన్నం చేసుకునే పనిలో బిజి బిజీగా ఉన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు, కళ్యాణదుర్గం గ్రౌండ్ రిపోర్ట్..కళ్యాణదుర్గం నియోజకవర్గం 1952 సంవత్సరం లో ఏర్పడింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీతో పాటు కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం చుట్టు మూడు వైపుల రాయదుర్గం , ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాలు ఉండగా .. ఓ వైపు మాత్రం కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఉంది. మూఢ నమ్మకాలు, సామాజిక వెనుబాటు తనం, పేదరికం, వలసలు ఈ ప్రాంతంలో సర్వసాధారణమే. ఎక్కువ శాతం వ్యవసాయ భూమి వర్షాధారమే.ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల పండ్ల తోటల సాగు బాగా విస్తరించింది. అధిక శాతం ప్రజలు వ్యవసాయం, కంబళ్ల తయారీతో ఉపాధి పొందుతున్నారు. కరువు కాటకాలతో ప్రతి ఏటా ఈ నియోజకవర్గం నుంచి కర్ణాటక ప్రాంతానికి వలస వెళ్లే వారి శాతం కూడా ఎక్కువే. పక్కనే ఉన్న రాయదుర్గం నియోజవర్గంలోని గుమ్మగట్ట వద్ద ఉన్న బైరవానితిప్ప ప్రాజెక్టు మూడు దశాబ్దాలుగా ఎండిపోవడంతో వేలాది ఎకరాలు బీడుగా మారింది. ఈ ప్రాంత ప్రజలపై కన్నడ భాష, సంప్రదాయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని నియోజకవర్గంలో మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు అంటున్నారు. కళ్యాణదుర్గంలో రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డు నిర్మించి అన్ని వసతులు కల్పించామని, రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులందరికి అందచేస్తామని అంటున్నారు.
రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని, డ్రిప్ సదుపాయాన్ని ఎక్కువ మందికి కల్పించేలా చర్యలు చేపడతామని చెబుతున్నారు.గత పాలనతో పోలిస్తే 2014లో తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గాన్ని చాలా వరకు అభివృద్ది చేశారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గృహాలు, పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా నిర్వహిస్తున్నారని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.