యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైకాపాలో చేరారు. మంగళవారం ఉదయం మోహన్ బాబు, అయన కుమారుడు విష్ణు లోటస్ పాండ్ కు చేరుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా ఇటీవల ఫీజు రియింబర్స్‌మెంట్ వివాదంపై స్పందించినట్లు సమాచారం. అనంతరం వారిద్దరిని జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తరువాత మోహన్ బాబు మాట్లాడుతూ, ప్రజలకు జగన్ మంచి చేస్తారనే నమ్మకంతోనే వైసీపీలో చేరానని చెప్పారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే వైసీపీలో చేరాలని అనుకున్నానని తెలిపారు. మూడేళ్ల క్రితమే తనను జగన్ ఆహ్వానించారని చెప్పారు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల, కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు నిరసనలకు దిగి, చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే.