Highlights
- బడి మానేసి తిరుగున్న కొడుకు
- ఎండలో కరెంటు స్థంభానికి కట్టేసిన తండ్రి
కన్న పాఠశాలకు వెళ్లి సరిగ్గా చదువుకోవడం లేదన్న కోపంతో విచక్షణను మర్చిపోయి ప్రవర్తించిన తీరు దారుణం. ఈ సంఘటన కొత్తగూడెం జిల్లా కమలాపురంలో చోటుచేసుకుంది. కొడుకు బడికి వెళ్లకుండా బయట తిరుగుతున్నాడని... మండుటెండలో కరెంటు స్థంభానికి కట్టేశాడు. కనికరం, మానవత్వాన్ని కోల్పోయి ఓ తండ్రి చేసిన పనికి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ..చూపరులను కంట తడిపెట్టిస్తుంది.