Highlights
- ఆసుపత్రికి తరలించే లోపు మృతి
శ్రీదేవి బాత్‌రూంలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అమె అక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందారని యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సురీ ప్రక్రొంటున్నారు. పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదిక పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. తాము సహాయం చేసేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులతో అందుబాటులో ఉన్నామని చెప్పారు.
అల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం కుటుంబంతో కలిసి శ్రీదేవి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పెళ్లిలో ఆనందంగా కనిపించింది. అయితే అంతలోనే ఆమె మృతి చెంది, అందరిని విషాదంలో ముంచింది. శనివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని దుబాయ్‌లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, అంధేరీలోని ఆమె ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.