YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని రేసులో లేను: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

 ప్రధాని రేసులో లేను: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీ ప్రధానమంత్రి అభ్యర్థి అనే వాదన ఖండించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.తాను ప్రధాని రేసులో లేనట్టుగా చెప్పుకొచ్చారు. గత కొంతకాలంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యానాలు కూడా ఇందుకు ఊతం ఇచ్చాయి. మధ్యప్రదేశ్- రాజస్తాన్- చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలయ్యాకా గడ్కరీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒకింత వివాదాస్పదం అయ్యాయి. విజయానికే తండ్రులు ఉంటారు… పరాజయం అనాథ ..దానికి ఎవరూ బాధ్యత అలాగే మహారాష్ట్రకు చెందిన ఈ నేతకు ఆర్ ఎస్ ఎస్ మద్దతు ఉందనే ప్రచారం కూడా జరిగింది. మోడీకి బదులుగా గడ్కరీని పెడితే మరి కొన్ని మిత్ర పక్షాలు కూడా సహకరించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.ఇలాంటి సమయంలోనే ఎన్నికలు వచ్చాయి. ఈ  సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..తను ప్రధాని రేసులో లేనట్టుగా ప్రకటన చేశారు.తమ పార్టీ జాతీయ స్థాయిలో నెగ్గుతుందని.. తాము తిరిగి అధికారం చేపట్టడం విషయంలో మాత్రం ఈయన విశ్వాసం వ్యక్తం చేశారు.తమ పార్టీకి కనీసం రెండు వందల డెబ్బై సీట్లు వస్తాయని నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తమ పార్టీ కూటమి నలభై ఎంపీ సీట్లను నెగ్గుతుందన్నారు.తను ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నట్టుగా పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తను ప్రధాని కావాలని అనుకుంటున్నట్టుగా జరుగుతున్న ప్రచారం కేవలం వదంతులు మాత్రమే అని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.ఇప్పుడైతే గడ్కరీ ఈ ప్రకటన చేశారు. మరి ఎన్నికలు అయ్యాకా కథ ఎలా ఉండబోతోందో! అప్పుడు ఇలాంటి వారు ఏమంటారో! వహించరని గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మోడీ అమిత్ షాలను లక్ష్యంగా చేసుకున్నవే అనే మాట వినిపించింది. 

Related Posts