YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ

Highlights

  •  కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి 
  • మార్చి ఆరు నుంచి శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌
  •  బీసీసీఐ ఓ ప్రకటన
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ

 త్వరలో జరగబోయే ముక్కోణపు సిరీస్‌కు బీసీసీఐ ఆదివారం  భారత జట్టును ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని కమిటీ 15 మందితో కూడా భారత జట్టును కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ప్రస్తుత జట్టులో ఉన్న ఆరుగురు కీలక ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. భారత జట్టుకు రోహిత్ శర్మ సారధ్యం వహిస్తారు. శిఖర్ ధవన్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, మనీష్ పాండే, దినేష్ కార్తిక్(కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్థూల్ ఠాకూర్, జయ్‌దేవ్ ఉనాద్కట్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్(కీపర్) వ్యవరిస్తారు. ఈ జట్టు మార్చి ఆరున శ్రీలంకతో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో తలపడనుంది. 

కొంత కాలంగా తీరికలేకుండా ఆడుతున్న కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ఈ సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. అలాగే బౌలర్లు భువనేశ్వర్, బూమ్రాలతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ పాల్గొనే ఈ సిరీస్‌కు రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సిరీస్‌కు దూరమైన ఆరుగురు కీలక ఆటగాళ్ల స్థానాల్లో.. దీపక్ హుడా, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, మహ్మద్ సిరాజ్ జట్టులోకొచ్చారు. సీనియర్ ఆటగాళ్లు దినేష్ కార్తిక్, సురేష్ రైనాలు తమ స్థానాలను నిలబెట్టుకోగా, మిడిల్ ఆర్డర్‌లో మనీష్ పాండే మరోసారి కీలక ఆటగాడిగా ఉండనున్నాడు. బౌలర్లలో జయ్‌దేవ్ ఉనాద్కట్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. అతడికి శార్థూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, స్పిన్నర్లు చాహల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సహకరించనున్నారు.

Related Posts