YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సెంటిమెంట్ పైనే పవన్ గురి

సెంటిమెంట్ పైనే పవన్ గురి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ సీటు ఇపుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. 2009లో కొత్తగా ఏర్పడిన గాజువాక తొలిసారి ప్రజారాజ్యానికి పట్టం కట్టింది. ఆ సెంటిమెంట్ తోనే పవన్ కూడా ఈ సీటు మీద మక్కువ పెంచుకున్నారు. పైగా ఇక్కడ కాపు సామాజిక వర్గం చాల ఎక్కువగా ఉంది. ఓ విధంగా గెలుపుని అందించే స్థాయి కాపులకు ఉంది. పైగా ఇక్కడ మెగాభిమానులు చాలా ఎక్కువ. అన్ని పార్టీల్లోనూ వారే ఉంటారు. అటువంటింది ఇపుడు జనసేన అధినేతే పోటీకి దిగితే ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇక్కడ కాపుల తరువాత యాదవులు బలంగా ఉన్నారు. ఆ తరువాత బీసీలు ఇక్కడ పెద్ద నిష్పత్తిలో కనిపిస్తారు. ఇక్కడ కార్మిక వర్గం కూడా బాగా ఎక్కువ. గాజువాక సీటు అంటే బహుముఖీయమైన సామాజిక వర్గాల సమాహారంగా చెప్పుకోవాలి. అందరూ దాదాపుగా వలస వచ్చిన వారే. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టాక గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడకు కాపులు రావడంతో వారి జనాభా ఇపుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఓ విధంగా సున్నితమైన ప్రాంతంగా కూడా గాజువాకను చూడాలి. ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి. దాంతో నిత్యం కార్మిక సమస్యలపై పోరాటాలు, సంఘర్షణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కార్మిక వర్గానికి అందుబాటులో ఉండాలి.గాజువాకలో పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు క్యాట్ వాక్ అయితే కాదని అంటున్నారు. అక్కడ ఇది పారిశ్రామిక వాడ. కార్మికులు బాగా ఉంటారు. ఇక్కడ తమ సమస్యలను నిత్యం చూసే లోకల్ ఎమ్మెల్యేగా ఉండాలని భావిస్తారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ సామాజికవర్గం. పైగా కార్మిక నేత పల్లా సింహాచలం కుమారుడు. దాంతో కార్మికుల ఓట్లు ఆయన‌కే పడతాయి. అలాగే యాదవులు కూడా అయనకే మద్దతుగా నిలవడం ఖాయం. ఇక వైసీపీ అభ్యర్ధిగా ఉన్న తిప్పల నాగిరెడ్డి ఓడినా గెలిచినా ఇక్కడ జనం అభిమానం నిండుగా సంపాదించుకున్న నాయకుడు . ఆయన 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 34 వేలకు పైగా ఓట్లు సాదించి రెండవ స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి 75 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. అప్పట్లో ఇక్కడ టీడీపీకి, జనసేన, బీజేపీ మద్దతుగా నిలిచాయి.విడిగా పోటీ చేస్తున్నందున వారి ఓట్లే చీలుతాయని, తనకు విజయం తధ్యమని వైసీపీ అభ్యర్ధి నాగిరెడ్డి భావిస్తున్నారు. ఇక అదే విధంగా కాపులూ ఓట్లు గుత్తమొత్తంగా జనసేనకు పడతాయని చెప్పలేరు. ఇక్కడ ఉన్న సమస్యలు తెలిసిన వారికే ఓటు చేస్తామని ప్రజలు చెబుతున్నారు అందువల్ల ట్రయాంగిల్ పోటీ ఇక్కడ జరుగుతుంది. పవన్ నామినేషన్ వేసేసి వెళ్ళిపొతే గెలిచేస్తామనుకుంటే పొరపాటేనని అంటున్నారు. ఆయన ఇక్కడే ఉంటానని జనాన్ని నమ్మించగలిగితేనే విజయం సాధిస్తారని అంటున్నారు. చూడాలి మరి

Related Posts