యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ పట్నం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఒకటిగా పేరొందిన అనకాపల్లి.. 1962లో పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ స్థానంలో టీడీపీకి చెందిన ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి బరిలో నిలుచున్నారు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో.. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా టీడీపీ, వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. విజయం మాత్రం టీడీపీనే వరించింది. ఆ పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 5,68,463 ఓట్లు సాధించి.. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై 47, 932 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 5, 20, 531 ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సబ్బం శ్రీహరి గెలుపొందారు.అనకాపల్లిలో మొత్తం ఓటర్లు 14, 01, 474 మంది ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 6, 89, 132 మంది కాగా మహిళా ఓటర్లు 7,12,342 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం విశేషం.జనరల్ స్థానంగా ఉన్న అనకాపల్లిలో.. ఇప్పటి వరకూ టీడీపీ, కాంగ్రెస్‌లతోనే గెలుపు దోబూచులాడింది. మూడో పార్టీ ఇంతవరకూ ఇక్కడ విజయాన్ని నమోదు చేయలేదు. 1962లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికలబరిలో నిలిచిన అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ మొదటి విజయం సాధించింది. ఆ తర్వాత కూడా వరుస విజయాలు నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీకి.. 1982లో ఆవిర్భవించిన టీడీపీ షాకిచ్చింది. అనంతరం విజయం ఈ రెండు పార్టీలతోనే వరకు వరుస విజయాలు నమోదు చేసిన ఆ పార్టీ.. టీడీపీ ఆవిర్భావం తర్వాత గట్టి పోటీ ఎదుర్కొంది.