యువ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు కఠిన పిచ్ ఎదురైంది. దీంతో స్వల్ప స్కోరే అయినా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్‌లో చెన్నై నిలకడగా ఆడి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. గత లీగ్ నుంచి లెక్కిస్తే ఇది సీఎ్‌సకేకు వరుసగా ఐదో విజయం. బౌలింగ్‌లో డ్వేన్ బ్రావో (3/33) వణికించగా.. బ్యాటింగ్‌లో షేన్ వాట్సన్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), రైనా (16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) చెలరేగారు. ఆఖర్లో ధోనీ (32 నాటౌట్), జాదవ్ (27) జట్టు బాధ్యతను తీసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది. ధవన్ (47 బంతుల్లో 7 ఫోర్ల తో 51) అర్ధ సెంచరీ సాధించాడు. బ్రావోకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా వాట్సన్ నిలిచాడు.