యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఏప్రిల్ 3 నుంచి 7 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. మొదటిరోజు ఉదయం 9.30గంటలకు యాగశాల ప్రవేశంతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆదేరోజు మహాలక్ష్మి అలంకారం, స్వామిఅమ్మవార్లకు భృంగివాహన సేవ, 4న మహాదుర్గా అలంకారం, కైలాసవాహన సేవ, 5న మహాసరస్వతి అలంకారం, నందివాహన సేవ, సాయ ంత్రం ప్రభోత్సవం, అగ్నిగుండప్రవేశం. 6న ఉగాది రోజున ఉదయం పంచాంగ పఠనం, సాయంత్రం రథోత్సవం, 7న భ్రమరాంబదేవికి నిజాలంకరణ, అశ్వవాహన సేవలు జరుగుతాయని ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఏప్రిల్ 4,5,6 తేదీల్లో స్వామివారి స్పర్శదర్శనాన్ని నిలిపివేస్తున్నామని చెప్పారు.