Highlights
- తలకు బలమైన దెబ్బతో ప్రాణాలు విడిచిన పసికందు
పట్టిస్తున్నప్పటికీ గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుతో విసిగెత్తిపోయిన ఓ తల్లి నిర్దాక్షణ్యంగా చెత్తకుండీ పాలుచేసింది.
ఈ దారుణం తూర్పు ఢిల్లీలో చోటుచేసుకుంది.అసహనానికి లోనైన నేహ తన పుట్టిగుడ్డుని తీసుకెళ్లి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసి చేతులుదులుపుకుంది.పాప కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులంతా కంగారుపడగా.. తాను కూడా వారితోపాటు వెతికే ప్రయత్నం చేసింది. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ విచారణలో నేహ చెత్తకుండీలో ఏదో మూట పడేయటం బయట పడింది. దీంతో పోలీసులు ఆమెను విచారిండంతో పాప ఏడుస్తుంటే తట్టుకోలేకనే తాను ఆ పని చేసినట్లు అంగీకరించింది. వెంటనే చెత్తకుండీ వద్దకు వెళ్లి చూడగా ...అక్కడ కొన ఊపిరితో ఉన్న పసికందును ఆస్పత్రికి తరలించి బతికించే ప్రయత్నం చేశారు. కానీ తలకు బలమైన దెబ్బ తలగటంతో ఆ పసికందు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో పోలీసులు నేహను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.