YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇండియా యాంటీ శాటిలైట్ మిషన్ సక్సెస్

ఇండియా  యాంటీ శాటిలైట్ మిషన్ సక్సెస్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశవాసులకు గర్వ కారణమైన వార్త ఇది. భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను పడగొట్టారు. కేవలం మూడే 3 నిమిషాల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దేశవాసులకు అత్యంత గర్వకారణమైన ఈ వార్తను బుధవారం (మార్చి 27) మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయని తెలిపారు. భారత్ నాలుగో రాజ్యంగా అవతరించిందని సగర్వంగా వెల్లడించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ విజయం సాధించామని తెలిపారు. భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ పేరును ‘మిషన్ శక్తి’గా ప్రధాని మోదీ వెల్లడించారు. భారతీయులకు ఇంతకంటే గర్వకారణమైన విషయం మరోటి లేదని అన్నారు. అంతరిక్షంలో 3000 కి.మీ. దూరంలో తక్కువ ఎత్తులో గల భూ స్థిర కక్ష్యలో క్రియాశీల ఉపగ్రహాన్ని నేలకూల్చామని ప్రధాని వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను యాంటీ శాటిలైట్ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు కేవలం 3 నిమిషాల్లో పూర్తిచేశారని ప్రధాని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన మిషన్ శక్తి ఆపరేషన్‌లో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన శాస్త్రవేత్తలందరినీ మోదీ అభినందించారు. మన శాస్త్రజ్ఞులను చూసి దేశం గర్వపడుతోందన్నారు. ‘భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి. అయితే ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రయోగం కాదు. కేవలం మన దేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడం కోసం చేసింది మాత్రమే. అంతరిక్షంలో శాటిలైట్‌ను పడగొట్టడం అనేది అత్యంత అరుదైన విజయం’ అని మోదీ అన్నారు.దేశ భద్రత, సాంకేతిక అభివృద్ధిలో భారత శాస్త్రవేత్తలు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని మోదీ కొనియాడారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్‌, వాతావరణం, నావిగేషన్‌ రంగాల్లో మనకు ఎన్నో శాటిలైట్లు ఉన్నాయని తెలిపారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, సాంకేతిక ఆధునికీకరణ కోసం మిషన్‌ శక్తి కీలక ముందడుగు లాంటిదని తెలిపారు.. 

Related Posts