యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
యాంటీ శాటిలైట్.. దీన్నే కైనటిక్ స్టిల్ వెపన్ అంటారు. కేవలం ఢీకొట్టడంతోనే శత్రు శాటిలైట్‌ను పేల్చేస్తారు. దీని కోసం ప్రత్యేక వార్‌హెడ్లను వాడరు. దీని కోసమే డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు మిషన్ శక్తిని నిర్వహించారు. ఇవాళ మిషన్ శక్తి పరీక్షను కేవలం 3 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఇది డీఆర్డీవో సమర్థతను తెలుపుతుందని మోదీ అన్నారు. కానీ పొజిషన్‌లో టార్గెట్‌ను ఫిక్స్ చేస్తేనే, అంత తక్కువ సమయంలో శత్రు శాటిలైట్‌ను పేల్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కానీ ఓ శాటిలైట్‌ను పేల్చే పరీక్షను భారత్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అగ్ర దేశాలు స్పేస్ ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంల భారత్.. యాంటి శాటిలైట్లన నిర్మించడం అత్యవసరం. అంతరిక్ష ఆయుధాలు భవిష్యత్తులో ఎక్కువగా వాడే అవకాశాలు ఉంటాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ శక్తిని చేపట్టారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష యుద్ధం కోసం భారత్ సిద్ధంగా ఉందన్న సంకేతాన్ని కూడా మోదీ వినిపించారు.వాస్తవానికి 2012 నుంచే యాంటీ శాటిలైట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మోదీ నిర్ణయం .. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. మిషన్ శక్తితో అంతరిక్ష శక్తిని భారత్ పెంచుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతరిక్షలో మహాశక్తిగా భారత్ ఎదిగింది. ఇప్పటి వరకు శత్రు దేశాల శాటిలైట్లను పేల్చే సత్తా కేవలం అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో ఇండియా చేరింది. ఇవాళ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్‌ను పేల్చినట్లు తెలుస్తోంది. తాము చేపట్టిన ప్రయోగం ఏ దేశాన్ని ఉద్దేశించి కాదు అని కూడా మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇవాళ సెక్యూర్టీ అధికారులతో మోదీ భేటీ అయ్యారు. ఆ తర్వాత తన ట్విట్టర్‌లో దేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నట్లు చెప్పారు. అయితే మోదీ తన ప్రసంగంలో .. భారత అంతరిక్ష సామర్థ్యాన్ని వినిపించారు. అంతరిక్షంలో భారత్ మిషన్ శక్తితో మహాశక్తిగా మారిందన్నారు