యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుపై వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా నాగబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంతూరిలో లైబ్రరీ పెట్టుకునేందుకు ప్రజలు చిరంజీవి ఇంటిని అడిగితే ఉమ్మడి ఆస్తుల పేరిట అడ్డుకున్న వ్యక్తి నాగబాబు అని ఆయన ఆరోపించారు. నాగబాబు ఎలాంటి వాడో జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని కృష్ణంరాజు అన్నారు. ఆయన పదవి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారే తప్ప ప్రజాసేవ కోసం కాదని విమర్శించారు. నాగబాబు తీరుతో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై ఉన్న గౌరవం కూడా పోతోందని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న నాగబాబు.. వాపును చూసి బలుపు అనుకోవద్దని హితవు పలికారు. ఏప్రిల్ 11న ఎవరి బలమెంతో తెలిసిపోతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.