శ్రీదేవి లాంటి వారిని కూడా అర్ధాంతరంగా తీసుకుపోయి.. దేవుడు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు..
జీవితం నీటిబుడగ వంటిది నో గ్యారంటీ నో వారంటీ అతిగా ఆవేశపడకండి..అతిగా ఆరాటపడకండి అని చెప్పడానికి అయ్యొండొచ్చు.
అందరి మదిలో అతిలోక సుందరి గా ముద్ర పడిన శ్రీదేవి ని వృద్ధాప్యం లో చూసి చాలామంది వర్మ లాంటి అభిమానులు గుండె ఆగి పోతారేమో అనుకుని ఉండొచ్చు.
మృత్యువు ముందు సెలబ్రిటీ హోదా, విఐపి కేటగిరీ లాంటివి పనికిరావు ఆటోమాటిక్ గా అందరూ ఒకే ఆర్డర్ లో వెళ్లిపోవాల్సిందే అనే నియమాన్ని గుర్తు చేయడం కోసం అయ్యొండొచ్చు.
ఏదేమైనా
అంగుళీకము లేదని స్వర్గలోక ప్రవేశానికి ఇంద్రుడు నిరాకరిస్తే మళ్లీ భూలోకానికి తిరిగి రా 'ఇంద్రజ'.