యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు,అసంబ్లి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి నేషనల్ కమ్యునిస్ట్ పార్టీ (ఎన్సిపి) భేషరతుగా సంపూర్ణ మద్దతును ప్రకటించింది.ఈ మేరకు పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించి నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృపాసత్యం తెలిపారు. నేడిక్కడ మీడియా సమావేశం లో పార్టీ సహాయ కార్యదర్శి కరణం సరస్వతి, అధికార ప్రతి నిధి మందా భూషణం లతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా కృపాసత్యం, కరణం సరస్వతి మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం లో పేద బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని,ప్రభుత్వ పథకాలు కేవలం పార్టీ కార్యకర్తలకే పరిమితమైనాయని వారు ఆరోపించారు.రాష్ట్రము లో వైసిపి పార్టీ అధికారం లోకి వస్తే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయయం జరుగగలదన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేసారు.రాష్ట్రము లో వైసిపి గాలి వీస్తుందని ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్ రావడం ఖాయమన్నారు.ఏపి లోని 25 ఎంపి సీట్లలో కనీసం 15 స్థానాలు వైసిపి గెలుచుకొని కేంద్రం లో ఏర్పడే ప్రభుత్వం లో కీలక పాత్రను పోషించగలదన్నారు. అధికార ప్రతి నిధి పార్టీ నేతలు ఉప్పుతల్ల నాగేశ్వర్ రావు,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాముల దానమ్మ,కార్యవర్గ సబ్యులు యు.నారాయణ,జెల్లి పోగు నవీన్ కుమార్,కళా పాపి నాయుడు,రమేష్,జల్లి పద్మ,కట్టవెంకట రామప్ప,బి.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.