యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పేద ప్రజల ఆరోగ్యమే టీడీపీ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ రోడ్ షో లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పత్తికొండ గుత్తి టర్నింగ్ సమీపంలో రోడ్ షో లో చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు ప్రతి ఇంటికి వంటగ్యాస్ అందజేశామని తెలియజేసారు.పొదుపు మహిళలకు పసుపు కుంకుమ కింద నగదును అందజేసామని తెలియజేశారు.పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ వైద్య సేవలను 5 లక్షల వరకు పెంచుతున్నట్టు రోడ్ షో లో తెలియజేశారు.చంద్రన్న పెళ్లి కానుక మొత్తాన్ని లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్టు తెలియజేశారు.వ్యవసాయంపై మరియు వేసవిలో నీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నాం అని తెలియజేసారు.పత్తికొండలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందజేస్తామని హామీ ఇచ్చారు.68 చెరువులకు నీరదించే భాధ్యత తీసుకుంటామని తెలియజేసారు.పోలవరం 70 శాతం పూర్తి అయిందని తెలియజేశారు.సిబిన్ ఆర్మీ ద్వారా యువత మంచి పనులు నిర్వహిస్తున్నారని సీఎం ప్రశంసించారు.యువత కొరకు నిరుద్యోగ భృతిని మూడు వేల రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహాయం లేకున్నా అభివృద్ధిని చేస్తున్నామని తెలియజేశారు.32 కేసులు ఉన్న నేరస్తులకు మద్దతు ఇచ్చి ఓటు వేస్తే రాష్ట్రం నష్టపోతుందని తెలియజేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులను దాదాపుగా 15 లక్షల వరకు ఉద్యోగాలు ఉన్నాయని తెలియజేశారు. కెసిఆర్,జగన్ లు ఇద్దరు కుమ్మక్కయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని తెలియజేశారు.మోదీ మైనార్టీలను మోసం చేశారని తెలియజేశారు. కీర్తిశేషులు కేఈ మాదన్న మరియు కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్ లో పని చేశానని, వారు అందరినీ కలుపుకొని పోయే వారు తెలియజేశారు.ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని,ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబును అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు.చివరిగా ఎన్టీఆర్ అమర్ రహే హై అంటూ రోడ్ షో ముగించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి,కర్నూల్ ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి,ఎమ్మెల్సీ కె.ఇ ప్రభాకర్,పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఈ శ్యాం బాబు,కోట్ల నివేదిత,ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి,పెండేకల్ భాస్కర్ రెడ్డి, ప్రమోద్,మద్దికేర వెంకటేశ్వర్ రెడ్డి,మద్దికేర ధనుంజయ,బత్తిన వెంకటరాముడు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.