YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీ నిలిపివేత

ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీ నిలిపివేత

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల వేళ ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గత రాత్రి నుంచి ఇప్పటివరకు మూడు జీవోలను విడుదల చేసింది. మంగళవారం రాత్రి సీఈసీ ఆదేశాలకనుగుణంగా ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం  తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరో జీవోను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని నిబంధనలు స్పష్టంచేస్తున్నందున  రాష్ట్రంలోని కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఈసీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ జీవో వెలువరించిన కాసేపటికే మరో ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మంగళవారం రాత్రి ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. కేవలం ఇద్దరు ఐపీఎస్‌లను మాత్రమే బదిలీచేస్తూ చేస్తున్నట్టు పేర్కొంది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రిలీవ్‌ చేయలేదు. ఆయన బదిలీని నిలిపివేస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Related Posts