యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ఒకరు మరొకరితో ఎప్పుడూ పోల్చుకోకూడదు.. అంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో ప్రత్యేకత వుంటుంది. ఆ ప్రత్యేకతను గుర్తించి దానిని హండ్రెడ్ పర్శంట్ ప్రదర్శించడంపైనే దృష్టి పెట్టాలి. అంతేతప్ప, పక్క వాళ్లతో పోల్చుకుని వాళ్లలా చేయలేకపోతున్నామని ఫీలవ్వకూడదు. ఇది హీరోయిన్లకు కూడా వర్తిస్తుంది' అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.