Highlights
- అందాల చిరునవ్వుల
- శ్రీదేవి మరణంపై
- అక్షర నివాళి...
సెలవంటూ వెళ్ళిపోయిన
ఓ చిరునవ్వు...!
**
ఆకాశంలో ఓ తారలా
నింగికెగసి,
నేల రాలిన
ఆ చిరునవ్వు
ఇక కనిపించబోదని
కోట్లాది అభిమాన
గుండెలు చెమ్మగిల్లిన
కనురెప్పలతో
మౌనంగా
రోదించాయి
మనిషికి మరణం సహజమైనదే
కానీ కొందరు శాశ్వతంగా
జీవించే ఉంటారు
అందులో ప్రముఖ
సినిమా నటి శ్రీదేవి గారు
ప్రముఖులు
తెలుగు సినిమా చరిత్రలో
ఎన్నటికీ ఎప్పటికీ చరిగిపోని
ముద్ర వేసి వెళ్లిపోయారు
జాతీయ స్థాయిలో హిందీ సినిమా
సామ్రాజ్యంలో తనకంటూ ఓ
ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని
భారతీయ రాజకీయ వ్యవస్థను
కులం రాజ్యమేలుతున్నట్లే
సినిమా రంగాన్ని కూడా
కులమే రాజ్యమేలుతున్న
సందర్భంలో
అనేక అటుపోట్లను తట్టుకోని
గాడ్ ఫాదర్ లేని ప్రతిభను
ప్రదర్శించన బహుముఖ
ప్రతిభాశాలి
భారతీయ మూలవాసీ
బహుజన అడబిడ్డ
భౌతిక సౌందర్య దృశ్యం
అదృశ్యమైపోతు
రంగుల చాటను దాగిన
కుట్రలను హేళన చేస్తూ
చరిత్ర శిళాపలకంపై అందమైన
తన చిరునవ్వు ముద్రను
చరిత్ర చిరునామా
పేజీలో శాశ్వత ముద్ర
వేసివెళ్లిపోయారు
ప్రకృతిలో జననం మరణం
సహజమైనదే
కానీ మరచిపోలేని
మరణాలే శాశ్వతంగా
చిరంజీవులై
చిరునవ్వుతో జీవిస్తునేఉంటాయి..