యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంత్రాలయం నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికలలో టిడిపి అభ్యర్థి తిక్కారెడ్డి పార్టీ గుర్తు సైకిల్ కి ఓటు వేసి గెలిపించాలని కల్పనా రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. గురువారం మండల పరిధిలోని చెట్ని హళ్ళి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంత్రాలయం టిడిపి మండల ప్రెసిడెంట్ వెంకటేష్ స్వామి ఆధ్వర్యంలో కల్పనా రెడ్డి కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అలాగే మంత్రాలయం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మా బావ గారు అయినా తిక్క రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఒక్కసారి తిక్కా రెడ్డి కి అవకాశం ఇవ్వండని అసెంబ్లీకి పంపించే బాధ్యత మీదేనని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.