YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మీడియా కుడా దిగజారింది

మీడియా కుడా దిగజారింది
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పాదయాత్రలో పాలకొల్లులో కూడా పర్యటించాను. ఆరోజు మీరు చెప్పిన మాటలు, బాధలు అన్నీ గుర్తున్నాయి.  పక్కనే గోదావరి ఉన్నా రెండో పంటకు నీరందడం లేదు. అంతో ఇంత పండినా గిట్టుబాటు ధర రావడం లేదు.  జిల్లాలో పామాయిల్, పొగాకు సాగు రెండూ జిల్లాలో ఎక్కువే. పొగాకుకు ఏటా ధర పడిపోతోంది. వేలం కేంద్రాల వద్ద నేను ధర్నా చేశాననని వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం అయన పాలకొల్లులో పర్యటించారు. జగన్ మాట్లాడుతూ పామాయిల్ కు ధర పక్కన తెలంగాణ కంటే రూ.1000 తక్కువ.  జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతి, అక్రమాలను కట్టడి చేస్తే, వారిని అభినందించాల్సింది పోయి, వారినే జుట్టు పడ్చుకుని ఈడ్చారు.  వైయస్సార్ హయాంలో మొదలైన డెల్టా కాలువల ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.  పాలకొల్లు ఆస్పత్రిలో 50 పడకలు ఉంటే, 100 పడకలుగా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు.  నియోజకవర్గంలో అభివృద్ధి అంటే, స్మశానాల అభివృద్ధి పేరుతో కమిషన్లు దండుకోవడం.  సుదీర్ఘ పాదయాత్రలో అందరి బాధలు విన్నాను. కష్టాలు చూశాను. ప్రభుత్వం పట్టించుకోని ప్రతి కుటుంబానికి చెబుతున్నాను. ‘నేను ఉన్నానని అన్నారు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాలన చూశారు. కుట్రలు చేస్తున్నారు. అబద్ధాలు, మోసాలు కొనసాగుతున్నాయి.  14 నెలలు పాదయాత్ర చేసి ప్రతి రోజూ నేను మీతో మమేకం అయ్యాను. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసని అన్నారు.  నాకు కలిగిన ప్రతి కష్టం, నష్టంతో చంద్రబాబుతో పాటు, ఆయన ఎల్లో మీడియా ఎంతో ఆనందించింది.  చివరకు మా చిన్నాన్న హత్యను కూడా పండగ చేసుకున్నారు. రాజకీయాలతో పాటు, మీడియా కూడా దిగజారింది.  ఇక్కడ చంద్రబాబు పార్టనర్, ఒక యాక్టర్. చంద్రబాబు కుట్రలో భాగమై విలువలన్నీ మర్చిపోయి, ఆయన ఏం చెబితే అదే చేస్తున్నారు.
అయ్యా చంద్రబాబు పార్టనర్, యాక్టర్ గారూ.. ముందుగా మీ కుటుంబాలు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను.  ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను.  ఇదే మీ కుటుంబంలో ఒకరిని బాబు హత్య చేయించి, మీరే ఆ పని చేశారు? అని చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటే 
మీకు బాధనిపించదా?  నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి కాపురం చేశారు. 2014లో చంద్రబాబుకు ఓటేయమని ప్రచారం చేశారని అన్నారు.   ఆ తర్వాత చంద్రబాబు చేసిన ప్రతి అన్యాయం, మోసంలో పాలు పంచుకున్నారు. ఆ అవినీతి, దారుణాల్లో మీకు వాటా లేదా?   నాలుగేళ్లు కలిసి ఉంటారు. ఏడాది ముందు విడిపోయినట్లు డ్రామా ఆడతారు. ఇదే పార్టనర్ నామినేషన్ వేస్తే అక్కడ టీడీపీ జెండాలు కనిపిస్తాయి.
ఇక ప్రతి ప్రచారంలో చంద్రబాబు 5 ఏళ్ల పాలన ప్రస్తావన ఉండదు. ఎంత సేపూ జగన్పైనే విమర్శలు కొనసాగుతాయి. ఎన్నికలు రావడంతో ఈ కుట్రలు ఇంకా సాగుతాయి. అసత్య ప్రచారాలు, నిందలు తీవ్రమవుతాయని జగన్ అన్నారు. 

Related Posts