Highlights
- 18 మందిపై కేసులు నమోదు
- సస్పెండ్ అయిన సీఐ కృష్ణయ్య
మద్యం మత్తులో యువతులపై లౌంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు. పార్టీ జరిగిన రోజు సీసీటీవి పుటేజ్ ద్వారా ఇప్పటికే ఏడుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.పార్టీ జరిగిన రోజు సీసీటీవి పుటేజ్ ద్వారా ఇప్పటికే ఏడుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ సంచలనం కలిగించిన రేవ్‌పార్టీ కేసులో పోలీసులు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించే ప్రయత్నంలో పడ్డారు. తప్పతాగి రేవ్ పార్టీలో నానాహంగామా సృష్టించిన వన్ టౌన్ సీఐ కృష్ణయ్యను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో రేవ్‌పార్టీకి సంబంధించిన 18 మందిపై పలు కేసులు నమోదు చేశారు. మద్యం మత్తులో యువతులపై లౌంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే పార్టీ జరిగిన రోజు వ్యవసాయ అధికారులు సైతం ఇందులో పాల్గొన్నారన్నవిశ్వనీయ సమాచారం అందడంతో పోలీసులు ఆ దిశగా దర్యాటు చేపట్టారు.