యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీగా ఇళ్ల వెంకటేశ్వరరావు గెలుపొందారు . కాకినాడ రంగరాయ కళాశాల ఆడిటోరియంలో 26వ తేదీన లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఫలితాలను జిల్లా కలెక్టర్ మిశ్రా వెల్లడించారు. పోటీలో 46 మంది అభ్యర్థులు ఉండగా ఇద్దరి మధ్య పోటీ ప్రధానంగా నెలకొంది. మొత్తం ఓట్లు 1,88,926 కాగా,1,75,467. మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంకటేశ్వరరావు కు 98,193 ఓట్లు రాగా, శేషారెడ్డి కి 38,124 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకటేశ్వరరావు 60,069 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.. ఈ సందర్భంగా వెంకటేశ్వర మాట్లాడుతూ విజయానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.