YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజకోట ఎవరిదో..?

రాజకోట ఎవరిదో..?

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాష్ట్రంలో రాయచోటి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. నియోజకవర్గం పేరుకి కడప జిల్లాలో ఉన్నా.. ప్రభావం మాత్రం చిత్తూరు జిల్లా ఓటర్లదే.ఎందుకంటే ఈ సెగ్మెంట్ లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. రాజంపేట ఎంపీ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు కడప జిల్లా పరిధిలో, పీీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ లోక్‌సభ స్థానంలో ప్రస్తుత ఎన్నికల్లో 14,69,651 మంది ఓటర్లు నమోదయ్యారు. గత ఎన్నికల్లో ఆ సంఖ్య 14,87,791గా ఉంది. ఈసారి ఓటర్లు తగ్గారు. తొలుత ప్రాంతీయత, అనంతరం పార్టీలకు ఇక్కడ ప్రాధాన్యమిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలను బట్టి పార్టీల ప్రభావం మారిపోతోంది.
1957లో ఏర్పాటైన రాజంపేట లోక్‌సభ స్థానంలో తొలిసారి టీఎన్‌వీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో అదే టీఎన్‌వీరెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓటమి చెందగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సీీఎల్‌ఎన్‌రెడ్డి 17,265 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1962 నుంచి 1980 వరకు పి.పార్థసారథి కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి వరుసగా ఐదు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తిరుగులేని రికార్డు సృష్టించారు. 1962లో గెలిచిన సీీఎల్‌ఎన్‌రెడ్ఢి. 1967లో పి.పార్థసారథిపై పోటీలో ఓడిపోయారు. 1984లో ఎస్‌.పాలకొండ్రాయుడు తెదేపా నుంచి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిగా ఆ ఎన్నికల్లో సాయిప్రతాప్‌ ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1989 నుంచి 1998 వరకు అన్నయ్యగారి సాయిప్రతాప్‌ నాలుగుసార్లు ఎంపీీగా గెలిచి ఇక్కడే రికార్డు సృష్టించారు. 1998లో సాయిప్రతాప్‌పై గునిపాటి రామయ్య తెదేపా నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1999లో గునిపాటి రామయ్య గెలుపొందగా.. 2004లో సాయిప్రతాప్‌ గెలుపొందారు. 2009లో సాయిప్రతాప్‌ విజయం సాధించగా.. 2014లో మిథున్‌రెడ్డి విజయం దక్కించుకున్నారు. స్థానం ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు చూస్తే పార్థసారథి, సాయిప్రతాప్‌ గెలుపు రికార్డుగా చెప్పొచ్ఛు 60 ఏళ్లలో ఇక్కడ ఐదుసార్లు లక్ష పైచిలుకు మెజారిటీ వచ్చింది. అందులో 1971లో తొలిసారి 1,80,868 ఓట్ల ఆధిక్యత కనబరచగా.. ఆ తర్వాత ర్యాంకు గత ఎన్నికల్లో సాధ్యమైంది. 1,74,762 ఓట్ల ఆధిక్యత మిథున్‌రెడ్డికి లభించింది. భాజపా పొత్తులో భాగంగా దివంగత ఎన్టీఆర్‌ కుమార్తె, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి గత ఎన్నికల్లో రాజంపేట నుంచి బరిలో నిలిచారు. అంతకుముందు, విశాఖ, బాపట్ల నుంచి గెలిచి కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె.. తొలిసారి రాజంపేట నుంచి పోటీకి దిగి ఓటమి పాలయ్యారు.
ఈసారి పార్టీలు ప్రాంతీయ సమీకరణాలపైనే దృష్టి పెట్టాయి. 4 అసెంబ్లీ స్థానాలు చిత్తూరు జిల్లా పరిధిలోనే ఉన్న క్రమంలో అక్కడి నేతలనే అభ్యర్థులుగా బరిలోకి దింపాయి. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి గత ఎన్నికల్లో వైకాపా తరఫున గెలుపొందారు. ఆయన్నే తిరిగి బరిలోకి దింపారు. తెదేపా తరఫున గతంలో పాలకొండ్రాయుడు, గునిపాటి రామయ్య బరిలో నిలిచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో భాజపా-తెదేపా పొత్తులో పురందేశ్వరి పోటీకి దిగారు. ఓటమి చెందారు. ఈసారి తెదేపా తరఫున కడప జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ప్రాంతీయత, సమీకరణాల నేపథ్యంలో చిత్తూరుకు చెందిన డీకే ఆదికేశవులునాయుడు సతీమణి డీకే సత్యప్రభను తెదేపా అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. ప్రాంతీయతకు పెద్దపీీట వేయడంతో పాటు.. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న కడప జిల్లాలో ఓ లోక్‌సభ స్థానం మహిళకు కేటాయించామన్న సంకేతాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఇక్కడ బరిలో ఉన్న తెదేపా, వైకాపా అభ్యర్థులు ఇద్దరూ ‘చిత్తూరు’ జిల్లా వాసులే. ఇప్పుడు పార్టీల పట్టు ఎలా ఉంటుందన్న విషయంగా ఉత్కంఠ నెలకొంది.

Related Posts