Highlights
- పర్యాటక రేవును పరిశీలించిన మంత్రి
పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పర్యాటక రేవును రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమ ఆదివారం సందర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పర్యాటకులతో కొద్దిసేపు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా త్వరలో ఇక్కడ బోట్లన్నింటినీ చెంగనపల్లి రేవుకు తరలిస్తున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. పర్యాటకులకు కావల్సిన సదుపాయాలను కల్పించాలని జిల్లా అధికారులకు చరవాణి ద్వారా మంత్రి ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి దేవినేని సమీక్షించారు. స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను పూర్తి చేసే బాధ్యతను నవయుగ తీసుకున్నాక కాంక్రీట్ పనుల్లో వేగాన్ని పెంచే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సమయంలో కాంక్రీట్ పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మంత్రి తెలుసుకున్నారు. రోజుకు ఎంత మేరకు పనులు జరుగుతున్నాయి, ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? వంటి అంశాలపై చర్చించారు. ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం పోలవరం ఎడమ కాలువ పనులు పురుషోత్తమపట్నం, సీతానగరం ప్యాకేజీ, కోరుకొండలో ప్యాకేజీ -1, జగ్గంపేట నియోజకవర్గం రామవరం వద్ద, పాయకరావుపేట వద్ద 6వ ప్యాకేజీ, విశాఖపట్నం విహారి వద్ద పోలవరం ఎడమ కాలువ పనులు పర్యవేక్షించాక.. విశాఖలో ఉత్తరాంధ్ర పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.