YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విదేశాల్లో చదువులు.. స్వ రాష్ట్రంలో సేవలు

 విదేశాల్లో చదువులు.. స్వ రాష్ట్రంలో సేవలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వారంతా రాజకీయ నాయకుల కుటుంబీకులు.. విదేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీల్లో చదివారు. సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి ప్రజాసేవలో మమేకమయ్యేందుకు జన్మభూమికి వచ్చారు. రాజకీయాల్లో ఉన్న తల్లిదండ్రుల స్ఫూర్తితో నవ్యాంధ్ర ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు.
నారా లోకేష్ 
లోకేశ్‌కు రాజకీయాలు కొత్త కాకపోయినా ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. అమెరికాలోని స్ర్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసిన లోకేశ్‌ 2009 నుంచి తండ్రి చంద్రబాబుకు సహకరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నందున లోకేశ్‌ ప్రత్యక్ష పోటీలో ఉండరని భావించినా, తాజాగా ఆయన్ను కూడా సీఎం ఎన్నికల బరిలో నిలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీ చేస్తున్నారు.
 
కిమిడి నాగార్జున
 మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున ఈ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేశారు. తనయుడి కోసం మృణాళిని చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. అమెరికాలో ఎంఎ్‌స పూర్తిచేసిన నాగార్జున 6 నెలల కిందటే రాష్ట్రానికి తిరిగి వచ్చారు.విజయనగరంలో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ప్రజా సేవ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణపై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు.
శ్రీ భరత్
నందమూరి బాలకృష్ణ అల్లుడు, గీతం వర్సిటీ వ్యవస్థాపకుడైన ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు శ్రీభరత్‌ విశాఖపట్నం నుంచి టీడీపీ తరపున లోక్‌సభ స్థానానికి పోటీపడుతున్నారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసి రాష్ట్రానికి వచ్చిన శ్రీభరత్‌ హైదరాబాద్‌లో గీతం క్యాంపస్‌ నిర్మాణ పనులు చూసుకున్నారు.
 
పరిటాల శ్రీరామ్
పరిటాల రవి వారసుడిగా పరిటాల శ్రీరామ్‌ రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. సింగపూర్‌లో బీబీఏ చదివిన కుమారుడి కోసం తల్లి, మంత్రి పరిటాల సునీత ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ ఎన్నికల్లో రాప్తాడు నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగారు.
 
మాగంటి రూప
ఎంపీ మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప ఈసారి రాజమండ్రి నుంచి టీడీపీ తరఫున పోటీచేస్తున్నారు. అరిజోనా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, రూరల్‌ డెవల్‌పమెంట్‌లో రూప డిప్లొమా చేశారు.
 
గల్లా జయదేవ్
ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో మోదీని నిలదీసి గుర్తింపు పొందారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2014లో గుంటూరు నుంచి పోటీచేసి గెలుపొందారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి తిరిగొచ్చి వ్యాపారవేత్తగా మారారు.
 
పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి
జేసీ వారసులుగా పవన్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి తండ్రి స్థానంలోనే లోక్‌సభకు పోటీచేస్తున్నారు. ఆయన స్విట్జర్లాండ్‌లో ఎంబీఏ పూర్తిచేసి, ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. దివాకర్‌రెడ్డి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నుంచి ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి పోటీచేస్తున్నారు. లండన్‌లో చదివిన అస్మిత్‌రెడ్డి ప్రజాసేవకు సన్నద్ధమయ్యారు.
 
దేవినేని అవినాష్
 మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడిగా అవినాష్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. లండన్‌లో ఎంబీఏ పూర్తిచేసి తిరిగొచ్చిన వెంటనే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున విజయవాడ ఎంపీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. తాజాగా గుడివాడ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు.
 
షబానా ఖాతూన్‌
ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వారసురాలిగా కుమార్తె షబానా ఖాతూన్‌ విజయవాడ పశ్చిమ నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారు. ఆమె భర్తతో పాటు అమెరికాలో ఉండేవారు

Related Posts