యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అంధ్ర ప్రజలకు బంగారు భవిష్యత్ కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించాలని బాల నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. శుక్రవారం సూగూరు గ్రామంలో సుడిగాలి పర్యటన చేపట్టారు.వైసిపి సీనియర్ నాయకుడు సీతారామిరెడ్డి సతీమణి గిరిజమ్మ , ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూతురు ప్రియాంక రెడ్డి, అనుషా రెడ్డి, కుమారి రెడ్డి, బాపిరెడ్డి సతీమణి, వైయస్సార్సీపి కన్వీనర్ మాలపల్లి సావిత్రమ్మ లు మండల పరిధిలోని సూగూరు గ్రామంలో వందలాది మంది కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు రుణ సహాయం, పొదుపు సంఘాల రుణాల మొత్తం నాలుగు దఫాలుగా మీ చేతికి అందిస్తామని, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని,రైతులకు వడ్డీలేని పంటరుణాలు, పేద ప్రజలకు వైద్య ఖర్చుల కింద 1000,రూపాయల నుండి 10,000,00 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం చేయిస్తామని అన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రబుత్వమే భరిస్తుందని , ప్రతి సంవత్సరం విద్యార్థులకు వసతి భోజనం కోసం అదనంగా 20 వేల రూపాయలు ఇస్తామని, ప్రతి పేదలందరికీ 2,50,000 రూపాయల సొంతింటి కళ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు మూడు వేల రూపాయల ఫింఛను అందిస్తామని, ప్రతి ఇంటి నుండి ఇద్దరు పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, తెలియజేశారు ఈ పథకాలన్నీ అమలు జరగాలంటే మన జగనన్న ముఖ్యమంత్రి కావాలని మంత్రాలయం నియోజకవర్గంలో బాల నాగిరెడ్డి ఎమ్మెల్యే గా గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు .చంద్రబాబు నాయుడు అవినీతి పరిపాలనకు చరమగీతం పాడాలని రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అన్నరు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు కరణం గోపాలరావు స్వామి, ఓంకార్ రెడ్డి, రాఘవరెడ్డి, దేవిరెడ్డి,విజేంద్రరెడ్డి,రవిరెడ్డి, వీరారెడ్డి,గోపిరెడ్డి, నారాయణరెడ్డి,ఎంపీటీసీ సత్యమ్మ, సెంట్రింగ్ అనుమంతు ,బోయలక్ష్మయ్య,లక్ష్మిరెడ్డి ,హనుమంతు విష్ణువర్ధన్ రెడ్డి,దేవదాసు, గోపీనాథ్, దావుద్ ,మాజీ సర్పంచ్ రామాంజనేయులు,నాగప్ప, వీర నాగుడు, మాల లక్ష్మన్న వీర నాగుడు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.