Highlights
- ఆమె ఫొటోలను చూడను.
అతిలోక సుందరి శ్రీదేవి నన్ను మోసం చేసి వెళ్లిపోయిందని నిత్యం వివాదాల మధ్య మెలిగే దర్శకుడు, శ్రీదేవి భగ్నప్రేమికుడు .రాంగోపాల్ వర్మ అంటున్నారు. చాలా మంది నేను ఏడ్చేస్తున్నాను అనుకుంటున్నారు.. అలాగే మెసేజ్ లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె అంత్యక్రియలకు వెళ్లనంటే వెళ్లను.. ఆమె పోయారన్న వార్త నాకు కర్ణకఠోరంగా ఉంది. ఆమె ఇంకా బతికే ఉన్నారన్న ఆలోచనలో ఉన్నాను. ఆమె అంత్యక్రియలకు నేను వెళ్లను. ఆమె ఫొటోలను చూడనంటూ వర్మ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియ శ్రీదేవి మరణించిన సమాచారం విన్న దగ్గర నుంచి కొనసాగుతుంది.
నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఆమెను ఓ దేవతగా చూస్తున్నాను.. ఆ లోకంలోనే బతికాను. ఆమె చనిపోయి.. తానూ మామూలు మనిషినేనని రుజువు చేసింది. నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. ఎందుకంటే మామూలు మనుషులు పోయి.. శ్రీదేవి పోతే... ఇంకేముంటుంది..
నమ్మలేకపోయా..నేను కలలు కంటుంటాను. అర్ధరాత్రి ఓ సారి చూస్తే... శ్రీదేవి గురించి అన్ని మెసేజ్ లు చూశాను. అది నమ్మలేకపోయాను. నాకు తెలిసిన వేరే శ్రీదేవి ఉన్నారనుకున్నాను. కల కంటున్నా అనుకున్నాను. మళ్లీ నిద్రపోయాను. తెలిసిన వారికి ఫోన్ చేసి కనుకున్నాను. వారి నిర్ధారించాను. మెంటల్ బ్లాక్ వచ్చేసింది. తనతో చేసిన పాటలు .. జామురాతిరి గుర్తుకు వచ్చాయి. వాటిని గుర్తు చేసుకొనేసరికి ఓ ఉద్వేగం వచ్చేసింది.
సినిమాల్లోకి రావడానికి ఆమే స్ఫూర్తి నేను సినిమాలోకి వచ్చిందే శ్రీదేవి స్ఫూర్తితో వచ్చాను. ఓ అభిమానిగా.. ఆరాధకుడిగా.. ఆమెతో సాన్నిహిత్యం ఉన్నవాడిగా చెబుతున్నాను. ఆమెను ఆరాధించాను.. కానీ ఏనాడు జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయలేదు.
దేవుడిని కొడదామన్నంత కోపం వస్తోంది..నిజమైన భక్తుడికి దేవత ఒక్కరే ఉంటారు. నేను దేవుణ్ని నమ్మను. ఎందుకు పుట్టాము.. ఎందుకు బతుకుతున్నాము.. అని మనల్ని మనం ప్రశ్నించుకున్నాం అనుకున్నప్పుడు నా జీవితంలో శ్రీదేవి ఒక కారణం. కోట్లలో ఒకరు ఆమె. లార్జర్ దాన్ లైఫ్. దేవుడు చాలా వరకు చెత్త పనులు చేస్తుంటాడు. కానీ మంచి మూడ్ లో ఉన్నప్పుడు దేవుడు యుగానికి ఒక్కసారి శ్రీదేవి లాంటి వారిని సృష్టిస్తాడు. ఇప్పుడు ఆయనను కొడదామన్న కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేశాడనిపిస్తోందంటూ ఆ దేవుడ్ని నిందిస్తూ ట్వీట్ చేస్తున్నారు వర్మ.