యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జాబు రావాలంటే బాబు అధికారంలోకి రావాలన్నారని అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు భర్తీ చేయరు. నిరుద్యోగ భృతి కుడా ఎగ్గొట్టారన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. టీడీపీ హయంలో మహిళా అధికారిని ఎమ్మెల్యే కొట్టినా కేసులుండవన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ దోషులకు శిక్షలుండవని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో రైతుల వడ్డీలు పెరిగిపోయాయని జగన్ విమర్శించారు. తేదాపా హయాంలో కంపెనీలన్నీ మూతపడ్డాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల భూములు టీడీపీ ప్రభుత్వం లాక్కున్నారని ధ్వజమెత్తారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో సాగు, తాగు నీరు రెండింటికీ ఇబ్బందే. అందుకే వైయస్సార్ ఆనాడు గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టులు చేపట్టారు. ఇప్పుడు వాటి పరిస్థితి దారుణంగా ఉంది. రామతీర్ధంకు సాగర్ నీరు కూడా ఇప్పించుకోలేకపోయారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద పంట కాలువలను ఈ 5 ఏళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేదని విమర్శించారు. 11 గ్రామాలలో ఇంకా పునావాసాస పనులు జరగలేదు. దీన్ని బట్టి జిల్లాపై చంద్రబాబు అశ్రధ్ధ కనిపిస్తుంది. ఇక్కడ పొగాకు రైతులు ఎక్కువ. వారి పరిస్థితి కూడా దారుణం. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కనీసం వారికి పెట్టుబడి కూడా రాలేదు. కంది కనీస మద్దతు ధర రూ.5675 కాగా, రైతులకు రూ.4000 కూడా దక్కడం లేదు. సుబాబుల్కు నాడు మహానేత హయాంలో రూ.4400 ధర రాగా, ఇప్పుడు రూ.2400 కూడా రావడం లేదని అన్నారు. శనగల కనీస మద్దతు ధర రూ.4620 కాగా, రైతులకు ఇప్పుడు రూ.3500 కూడా రావడం లేదు. అయినా వారి బాధలు వినే నాధుడే లేడు. జిల్లాలో దాదాపు 1100 యూనిట్లు, చీమకుర్తిలో దాదాపు 500 యూనిట్లు ఉంటే. జిల్లా వ్యాçప్తంగా ఇప్పటికే దాదాపు 500 యూనిట్లు మూతబడ్డాయి. చంద్రబాబు హయాంలో గ్రానైట్, పాలిషింగ్ యూనిట్ల విద్యుత్ ఛార్జీలు, రాయల్టీ పెంచడం వల్ల పరిశ్రమలు మూతబడుతున్నాయని అయన అన్నారు.