Highlights
- హైడ్రేషన్, బ్లడ్ ప్రెషర్
- జీఎంసీ ఆసుపత్రికి తరలింపు

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అస్వస్థతకు గురయ్యారు. డీ హైడ్రేషన్, బ్లడ్ ప్రెషర్ కారణాలతో ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. వాస్తవానికి పారికర్ గురువారమే ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలుండటంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు. ప్రస్తుతం అయన ఆటోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.