YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఫస్టాఫ్ ఎమోషన్స్.. సెకాండఫ్ కుట్రలు

ఫస్టాఫ్ ఎమోషన్స్.. సెకాండఫ్ కుట్రలు

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎట్టకేలకు విడుదలైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించింది.. ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకున్న తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? లాంటి కీలకఘట్టాలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రూపొందించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ జీవితంలో కొత్త కోణాన్ని.. ప్రజలకు తెలియని రహస్యాలను లక్ష్మీ పార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’గా నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. 1989 తరువాత అధికారం కోల్పోయిన ఎన్టీఆర్ మానసిక క్షోభను అనుభవిస్తున్న తరుణంలో ఆయన జీవిత చరిత్రను రాయడానికి లక్ష్మీ పార్వతి (యజ్ఞశెట్టి) ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒకవైపు చంద్రబాబు వెన్నుపోటు.. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌ని పట్టించుకోకపోవడంతో లక్ష్మీ పార్వతి.. ఎన్టీఆర్‌కు అన్నీ తానై సపర్యలు చేస్తుంది. లక్ష్మీ పార్వతి తనపై చూపిస్తున్న ప్రేమకు కృత‌జ్ఞతగా ఎన్టీఆర్ చివరిరోజుల్లో లక్ష్మీ పార్వతి రెండో వివాహం చేసుకున్నట్టు ప్రకటిస్తారు. ఫస్టాఫ్ మొత్తం లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్‌ల మధ్య ఎమోషన్స్ సీన్లతో ఆకక్తికరంగా మలిచారు ఆర్జీవీ. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ తిరిగి అధికారాన్నిచేపట్టడంతో కీలకంగా మారిన లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ నుండి దూరం చేయడానికి చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేశారు. వైశ్రాయి హోటల్‌లో ఎన్టీఆర్‌ని అవమానించి ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌కి అధికారాన్ని ఎలా దూరం చేశారన్నది వాస్తవిక సంఘటలతో కళ్లకు కట్టి చూపించారు. వర్మ తాను చెప్పదల్చుకున్న విషయంపై పూర్తి క్లారిటీ ఉండటంతో సీన్లను చాలా ఎమోషనల్‌గా రూపొందించారు. ఎన్టీఆర్ మరణానికి దారితీసిన పరిస్థితుల్లో వాస్తవం ఎంత అన్నది పక్కనపెట్టేస్తే.. వర్మ తీసిన విధానం ప్రేక్షకుడికి కొత్త అనూభూతిని ఇస్తుంది. ఎన్టీఆర్‌గా నటించిన విజయ్ కుమార్ పాత్రలో లీనం అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ క్లోజ్ ఫ్రేమ్స్‌లో ఎన్టీఆర్‌గా ఊహించుకోలేం. లక్ష్మీ పార్వతిగా నటించిన యజ్ఞశెట్టి పాత్రకు పూర్తి న్యాయం చేసింది. చంద్రబాబుగా నటించిన శ్రీతేజ్ ఈచిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు. కళ్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ చిత్రానికి ప్లస్ అయ్యింది. 

 

Related Posts