YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఇక 5జీ నెట్‌వర్కింగ్

Highlights

  •   భారత్‌లో తొలిసారి 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌
  • జీబీపీఎస్ కు  పైగా డేటా స్పీడ్‌
ఇక 5జీ నెట్‌వర్కింగ్

భారత్‌లో తొలిసారి 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌ను నిర్వహించాయి. ఇందులో 3 గిగాబైట్ పర్ సెకన్ (జీబీపీఎస్)కు పైగా డేటా స్పీడ్‌ను సాధించినట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. గురుగావ్‌లోని మానేసర్ వద్ద ఉన్న ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఈ ట్రయల్స్ జరిగాయి. దేశీయ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్, అలాగే చైనాకు చెందిన నెట్‌వర్కింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఉపకరణాల తయారీ సంస్థ హువాయి ఈ ప్రయత్నం చేసింది.


భారత్‌లో ఈ కొత్త టెక్నాలజీ ఏర్పాటుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తాం’ అని భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్స్ డైరెక్టర్ అభయ్ సావర్గోంకర్ తెలిపారు. తాము 5జీ టెక్నాలజీ అభివృద్ధికి, దాని ఉపయోగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని హువావే వైర్‌లెస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎమాన్యుయే కోయెలో ఆల్వెస్ పేర్కొన్నారు.  

గురుగావ్‌లోని మానేసర్ వద్ద ఉన్న ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఈ ట్రయల్స్ నిర్వహించామన్నారు. 5జీ దిశగా మా ప్రయాణానికి తాజా ట్రయల్స్ చాలా కీలకమైనవి. మన జీవన విధానాన్ని మార్చగలిగే శక్తిసామర్థ్యాలు 5జీకి ఉన్నాయంటున్నారు.

Related Posts