యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనవరి లో శ్రీకాకుళం లో బయలుదేరి నేటికీ72 రోజుల పాటు పర్యటించాను. మా ఆవేదనను, ఆకాంక్షలను ప్రజలకు తెలియాలి. ఈ ఎన్నికలలో టిడిపి కి ఓట్లు వేయకుండా ఓడించాలని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మమ్మలను మోసం చేశారు, ఆయన వల్ల అణచివేత కు గురయ్యాం.
ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన మోసం మా కళ్లల్లో మెదులుతుంది. మేము ఎన్ని ఇబ్బందులు పడినా ప్రతిపక్షం కూడా ఏనాడూ మాకు అండగా లేదు. సమస్యల పై స్పందించని ప్రతిపక్ష పార్టీకి కూడా ఎవ్వరూ ఓటు వేయవద్దు. వాళ్లిద్దరి పై విశ్వాసం లేనందున *నోటా* కే ఓటు చేయాలని మా సోదరులను కోరుతున్నామని అయన అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే డబ్బు కు లొంగొద్దు. మాదిగల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేందుకే నోటాకు ఓటువేయాలి. గత ఎన్నికలలో చంద్రబాబు ను నమ్మి మద్దతు ఇచ్చాం. ఎస్సీ వర్గీకరణ కు.. సై అని, పెద్ద మాదిగ అవుతా అన్న చంద్రబాబు మాట తప్పారని అన్నారు. మేము నిజాయితీ గా ఉన్నాం, పైసల కోసం మా జాతిని తాకట్టు పెట్టం. అసెంబ్లీ లో వర్గీకరణ కు తీర్మానం కూడా చేయలేదు. న్యాయమైన డిమాండ్ ల కోసం పోరాటం చేస్తే అరెస్టు లు చేయించారు. అమరావతి లో విశ్వరూప మహాసభ పెడితె అడ్డుకున్నారని ఆరోపించారు. మా సహకారం తో గెలిచిన చంద్రబాబు మా పైనే దాడులు చేయించారు. చంద్రబాబు ను ఓడించేందుకు ప్రచారం చేసిన జూపూడి, కారెం శివాజీలకు పెద్ద పీట వేశారు. దళితుల సంక్షేమాన్ని పూర్తి గా మాలల సంక్షేమంగా మార్చేశారని ఆరోపించారు. ఇప్పటికీ మమ్మలను చంద్రబాబు చిన్న చూపు చూశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులకే సీట్లు కేటాయించారు. అన్ని విధాలా మోసం చేసిన చంద్రబాబు, మా కష్టాలు పట్టించుకోని జగన్ లకు ఓట్లు వేయకుండా, నోటా కే వేయాలని నిర్ణయించామని అన్నారు.