యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఐపీఎస్ల బదిలీలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. అడ్వకేట్ జనరల్ తమ్మాలపాటి శ్రీనివాస్ సీఎం నివాసానికి చేరుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఐపీఎస్ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.