యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
సినిమా తారనైనా కూడా నేను ఇప్పటికీ జనం మధ్య మామూలుగానే తిరుగుతుంటాను.. అంటోంది అందాల నాయిక కీర్తి సురేశ్ . 'అవును, స్టార్ గా ఒక ఇమేజ్ వచ్చాక ఎక్కడికి వెళ్లినా జనం ఎగబడతారు. దాంతో కాస్త ఇబ్బంది వుంటుంది. అలాగని చెప్పి నేను నా సరదాలు తీర్చుకోవడం మానను. ఇప్పటికీ నా షాపింగ్ నేనే చేసుకుంటాను. ఆర్టిస్టుని కాకముందు ఎలా అయితే తిరిగే దానినో అలాగే తిరుగుతున్నాను. జనం వచ్చి మాట్లాడుతుంటారు. అదో కిక్' అని చెప్పింది.