YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

అంత్యక్రియలు రేపటికి వాయిదా..?

Highlights

  • పూర్తైన పోస్ట్ మార్టం ప్రక్తియ
  •  మంత్రముగ్ధులైన విదేశీ ప్రధాని
  • అతిలోక సుందరి ఖ్యాతికి నిదర్శనం
అంత్యక్రియలు రేపటికి వాయిదా..?

దుబాయ్ లో   ప్రముఖ నటి  శ్రీదేవి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం ప్రక్తియ సోమవారం ఉదయం పూర్తయింది. కానీ పోస్ట్ మార్టం నివేదిక మాత్రం ఇంకా రాలేదు. విదేశీ నిబంధనల కారణంగా శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి  తరలించే ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీనితో శ్రీదేవి పార్థివదేహం ఇండియాకు తెరలించే సమయం, ఆమె అంత్య క్రియల విషయంలో స్పష్టత రావడం లేదు. దింతో ఆమె  అంత్యక్రియలు సోమవారం జరిగే నేపథ్యంలో శ్రీదేవిని  కడసారి చూసుకునే అవకాశం ఎక్కువ మంది అభిమానులకు కలగక పోవచ్చు. దీనితో శ్రీదేవి అంత్యక్రియలు రేపటికి వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా ఈ విషయంలో శ్రీదేవి కుటుంబ సభ్యుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
.శ్రీదేవి భౌతిక కాయాన్ని మింబై కి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నానులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో  శ్రీదేవి పార్థివ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై కు అనిల్ అంబాని  ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.  కానీ దుబాయ్ లో అధికార నిబంధన కార్యకమాలు పూర్తికావడానికి ఆలస్యం జరుగుతోంది. దీనితో శ్రీదేవి మృతదేహం ముంబై కి ఎప్పుడు చేరుకునేది స్పష్టం లేకుండా పోయింది. 
ఇదిలా ఉండాగా శ్రీదేవి ఖ్యాతి భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. ఆమె సౌందర్యం, నటన విదేశీయులని సైతం మంత్రముగ్దుల్ని చేసింది. పాక్ లోని నటులు శ్రీదేవి మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి సౌందర్యానికి విదేశీ ప్రధాని సైతం మంత్రముగ్దుడయ్యారు. ఇది నిజం. టిబెట్ ప్రధానిగా ఉండి బహిష్కరణకు గురైన లొంబ్ సాంగ సాంగే శ్రీదేవి మృతి పట్ల షాక్ కు గురయ్యారు. ఆయన స్వయంగా శ్రీదేవి మృతికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేయడం విశేషం.తాను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో శ్రీదేవి చిత్రాలని విపరీతంగా చూసేవాడనని లొంబ్ సాంగ సాంగే గుర్తు చేసుకున్నారు. శ్రీదేవిని కోల్పోయిన లక్షలాది మంది అభిమానుల్లో తాను కూడా ఒకడినని సాంగే స్పందించడం ఈ అతిలోక సుందరి ఖ్యాతికి నిదర్శనం.

Related Posts