యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ద్వజస్దంభం విరిగిపడి మహిళ మృతిచెందింది. ముమ్మిడివరం నగరపంచాయితీ ఆఫీసు ప్రక్కన గల ఆభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నూతనంగా ఏకశిలా ద్వజస్దంభం ఏర్పాటుకు భక్తులు సన్నాహాలు చేసారు. రెండు పెద్ద క్రేనులను రప్పించి ద్వజస్దంభాన్ని నిలుపుతుండగా దురదృష్టవశాత్తు ఆ స్దంభం విరిగిపోయింది. ఈ ఘటనలో స్దానిక మహిళ గుడిపూడి వరలక్ష్మి(50) మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు. గతంలో పెధాయ్ తుఫాను సమయంలో వీచిన పెనుగాలులకు పాత ద్వజస్దంభం కూలిపోగా భక్తుల సహకారంతో శనివారం ఏకశిలా ద్వజస్దంభాన్ని ప్రతిష్ఠిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.