యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శనివారం కర్నూలు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేశాడో చెప్పలేని నిస్సహాయ స్దితిలో మాట్లాడాడు. నిక్కరేసుకున్న పిల్లాడిని అడిగినా ఏపి కి మోదీ చేసిన అన్యాయం గురించి చెప్తారు. 5 కోట్ల ఆంధ్రులను అవమానించేలా మోదీ ప్రసంగం ఉంది. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రచారం చేసుకునే స్దితికి చేరాడు. మోదీ సభకు వైసిపి కార్యకర్తలను జగన్ భాహాటంగానే తరలించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. మోదీ, కేసిఆర్, జగన్ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపాలని దుర్బుద్ధితో పని చేస్తున్నారు. మోదీ, కేసిఆర్ ఆంధ్రులను తిడుతుంటే జగన్ వారిని నెత్తిన పెట్టుకొని మోస్తున్నాడు. విభజన హామీలు, ప్రత్యేకహోదా గురించి మోదీ ఒక్కమాట మాట్లాడలేదు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానన్న మోదీ హామీ ఏమయిందని ప్రశ్నించారు. సూర్యుడు కుమారుడు సూర్యుని లక్షణాలతోనే వస్తాడు. ముట్టుకుంటే మసయిపోతారని అన్నారు. లోకేష్ నిర్వహించిన పంచాయితీరాజ్ శాఖ పనితీరుని గుర్తించి ఇచ్చిన అవార్డులు ఇచ్చింది మీరు కాదా అని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు ఓట్లతో మోదీకి బుద్ధిచెప్పనున్నారు. రాయలసీమకి వచ్చి కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేని స్ధితిలో మోదీ ఉన్నాడు. సాగరమాల క్రింద ఏమిచ్చారో మోదీ చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పి వెళ్లాల్సింది పోయి ఇంకా అవమానించి మోదీ వెళ్లాడు. ఎక్కువ కేసులతో అఫిడవిట్ దాఖలు చేసిన జగన్ కు కాపలాదారుగా మోదీ వ్యవహరిస్తున్నారు. కేసిఆర్, జగన్ మా మిత్రులని పీయూష్ గోయల్ చెప్పారని అన్నారు. 60 లక్షల పెన్షన్ దారుల నోట్లో మట్టి కొట్టాలని మోదీ, కేసిఆర్, జగన్ చూస్తున్నారని అన్నారు.