YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఓ నాయకులారా ఆన్ లైన్ న్యూస్ ఛానెల్స్ ను చిన్న చూపు చూసి చేతులు కాల్చుకోకండి..!!

 ఓ నాయకులారా ఆన్ లైన్ న్యూస్ ఛానెల్స్ ను చిన్న చూపు చూసి చేతులు కాల్చుకోకండి..!!

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఈ కాలంలో ప్రతి రంగంలోనూ ప్రముఖ పాత్ర పోషించేది ప్రసార వ్యవస్థలు.  మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది.  రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య ఒక వారధిలా మీడియా పని చేస్తుంది. మొదట న్యూస్ పేపర్లు ద్వారా వార్తలు తెలుసుకునేవాళ్ళం.. తరువాత కాలం మారేకొద్దీ, వసతులు కూడా పెరుగుతూ ఉండడంతో మన అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లలోనే మన ప్రపంచం అంత ఉంటుంది.  
           మన దేశంలో కొన్ని వేల వార్త పత్రికలు, న్యూస్ ఛానల్, ఆన్ లైన్ న్యూస్ ఛానల్ లు ఉన్నాయి. వీటిలో చాలా మంది వీక్షకులు ఆన్ లైన్ న్యూస్ చానెల్స్  ద్వారానే ప్రస్తుత రాజకీయ, వాణిజ్య , క్రీడ, సినిమా రంగాలలో  ఏమి జరుగుతుందో తెలుసుకుంటున్నారు. మన దేశం లో ఎన్నో ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ ఉన్నాయి. ప్రతి పోర్టల్ కి  లక్ష నుంచి పది లక్షల వరకు వీక్షకులు ఉంటారు.  ప్రతి రంగం వారు ఈ ఆన్ లైన్ ఛానెల్స్ ను వాడుకుని తమ తమ రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఆన్ లైన్ న్యూస్ ఛానెల్స్ ని చిన్న చూపు చుస్తునారు.   ఒకటో, రెండో ప్రముఖ న్యూస్ ఛానెల్స్ ని, మరికొన్ని ఊరు పేరు లేని అడ్డమైన టీవీ ఛానెల్స్ ని నమ్ముకుంటూ ఆన్ లైన్ ఛానెల్స్ ని పట్టించుకోవడం మానేశారు..  ఇటీవల కాలంలో 18-25 సంవత్సరాలు వయస్సు ఉన్న ఎంతో మంది యువతకు కొత్త ఓట్లు వచ్చాయి. ఈ కాలం యువత అందరు టీవీ లో ప్రసారమయ్యే వార్తలు చూడట్లేదు అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో ఆన్ లైన్ న్యూస్ యాప్ లు ఇన్స్టాల్ చేసుకుని వాటిని ఫాలో అవుతున్నారు.  2018 లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికల్లో ప్రముఖ జాతీయ పార్టీ బీజేపీ ఇలాగే ఆన్ లైన్ ఛానెల్స్ ని చిన్న చూపు చూసి ప్రముఖ ఛానెల్స్ ద్వారా తమ ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నికలలో ఆన్ లైన్ న్యూస్ ఛానెల్స్ కీలక పాత్ర పోషించి తమ ఓటమికి కారణం అయ్యాయి. ఈ ఎన్నికలలో 30-40 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ కేవలం 10 నుంచి 300 ఓట్లు తేడాతోనే ఓడిపొయ్యారు.  బీజేపీ పార్టీ కి  అప్పుడు అర్ధమైంది తాము చేసిన తప్పేమిటో.. తాము నిర్లక్ష్యం చేసిన ఆన్ లైన్ ఛానెల్స్ ద్వారా వచ్చే కొంత శాతం ఓట్లు వల్ల వాళ్ళు  ఓడిపోయారని  తెలుసుకున్నారు.
              ఇప్పుడు 2019 ఎన్నికలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో  కొన్ని ప్రాంతీయ పార్టీ నాయకులూ, మరి ముఖ్యంగా వైసీపీ  పార్టీ నాయకులు  కూడా ఆన్ లైన్ ఛానెల్స్ ని చిన్నచూపు చూసి ఆ ఛానెల్స్ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ తమ డప్పు కొట్టే  కొన్ని టీవీ ఛానెల్స్ కు కోట్లు కోట్లు కుమ్మరిస్తూ.. పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసుకుంటున్నారు.  ముఖ్యంగా పల్నాడు, కృష్ణ, రాయలసీమ కు చెందిన వైసీపీ నాయకులు మితి మీరిన ధీమాతో ఆన్ లైన్ ఛానెల్స్ ను ఎగతాళి చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏమిటి అంటే 18-60 వయస్సు ఉన్న ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది వాళ్ళందరూ  ఆన్ లైన్ వార్తలను, తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్న ఆన్  లైన్ న్యూస్ పోర్టల్స్ ని ఫాలో అవుతున్నారని.  అమెరికా వంటి దేశాలలో కూడా  ఎన్నికల్లో ఆన్ లైన్ న్యూస్ చానెల్స్ ద్వారానే ప్రచారం చేసుకుంటారు. కనుక ప్రతి రాజకీయ పార్టీకి సుకుమారంగా హెచ్చరిస్తూ చెప్పేది ఏమిటి అంటే ఆన్ లైన్ న్యూస్ ఛానెల్స్ ని తక్కువ అంచనా వేసి మీ గొయ్య మీరు తీసుకోకండి.

Related Posts