Highlights
- పరీక్షకు అనుమతించని నిర్వాహకులు
- బోరున విలపిస్తున్న విద్యార్థులు
టెట్ పరీక్షకు రెండు నిముషాలు ఆలస్యమైందనే కారణంతో ముగ్గురు విద్యార్థులను నిర్వాహకులు పరీక్షకు అనుమతించలేదు. విద్యార్థుల్లో ఒకరు గర్భిణి ఉన్నారు. పరీక్షకు అనుమతిచకపోవడంతో వారు బోరున విలపిస్తున్నారు. తాను గుంటూరు నుంచి చిన్న పాపతో కలిసి వచ్చానని, దయచేసి పరీక్షకు అనుమతించండని ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు. ఈ సంఘటన విజయవాడ పటమట సెంటర్లోని డొంక రోడ్డులో ఉన్న స్టైలిష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పరీక్ష కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.