యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బెయిలుపై ఉన్నప్పటికీ, కాపలాదారును నిందిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలోలో జరిగిన బీజేపీ ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీలపై తీవ్రంగా విమర్శలు చేసారు. మాట్లాడుతూ కాంగ్రెస్అగ్రనేతలపైపరోక్షంగావిమర్శలుగుప్పించారు.రాహుల్, సోనియాలతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఢిల్లీలో కూర్చుని, పన్నులు ఎగ్గొట్టే, రైతుల భూములను లాక్కొనే పత్రికా కార్యాలయం కోసం ఇచ్చిన ప్రభుత్వ భూమిని అద్దెకు ఇచ్చుకుని డబ్బు సంపాదించే రక్షణ ఒప్పందాల్లో కమిషన్లు తీసుకునే నాయకులు ఉన్నారన్నారు. ఆ నాయకులకు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయట తిరుగుతున్నారన్నారు. వెంట్రుక వాసిలో (జైలు) జీవితాన్ని తప్పించుకున్నారన్నారు. తామే స్వయంగా బెయిలుపై ఉన్నవాళ్ళు కాపలాదారును నిందిస్తున్నారని దుయ్యబట్టారు.అరుణాచల్ ప్రదేశ్‌ను ఈశాన్య భారత దేశాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మోదీ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరమని నిపుణులు చాలా దశాబ్దాల నుంచి చెప్తున్నారని గుర్తు చేశారు. నిపుణులు ఎంతగా చెప్తున్నప్పటికీ ఉన్నత వంశ కుటుంబం. ఆ కుటుంబానికి సన్నిహితులు తమ సొంత ఇలాకాను సృష్టించుకోవడానికే సమయాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వారు అరుణాచల్ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజా సంక్షేమం కన్నా తమ సొంత లాభం కోసమే వారు పాటుపడుతున్నారన్నారు.ఇటీవల విజయవంతమైన యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష గురించి తాను ప్రకటించినందుకు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మోదీ అన్నారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం నిర్వహించిన దాడుల విషయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయన్నారు. శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే, వారిని ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేస్తున్నారన్నారు. ఈ పరీక్ష విజయవంతం కావడం మన దేశానికి గర్వకారణమని చెప్పారు. అది మింగుడుపడని ప్రతిపక్ష నేతలు ఉగ్రవాదుల భాష మాట్లాడుతున్నారన్నారు. ఆ నేతలను మన దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదని వారిని పాకిస్థాన్‌లో ప్రశంసిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ వార్తా పత్రికల్లో మన దేశ ప్రతిపక్ష నేతల ఫొటోలను ప్రచురించారన్నారు.మన దేశ ప్రతిపక్ష నేతలకు పొరుగు దేశంపై చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని, మన దేశాన్ని ప్రశంసించలేనంత స్థాయిలో పొరుగు దేశాన్ని ప్రేమిస్తున్నారని మండిపడ్డారు.