YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోడికత్తి పార్టీ ఎంబీఏ నుంచి డిగ్రీకి దిగారు

కోడికత్తి పార్టీ ఎంబీఏ నుంచి డిగ్రీకి దిగారు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రతిపక్ష నేత జగన్ పై సెటైర్లు గుప్పించారు. కోడికత్తి పార్టీ అధినేత రోజుకో క్వాలిఫికేషన్ పెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. మొదట్లో ఎంబీఏ అని పెట్టుకునేవాడని, ఇప్పుడెందుకో బీకాం అని పెట్టుకుంటున్నాడని విమర్శించారు. ఎవరైనా బీకాం తర్వాత ఎంబీఏ చేస్తారని, ఈయనేంటో ఎంబీఏ నుంచి బీకాంకు తగ్గాడని ఎత్తిపొడిపు పొడిచారు. ఆయన చేసేవన్నీ తప్పుడు పనులేనీ, ఏమీ తెలియని జీరో అని వ్యాఖ్యానించారు. అతడ్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే తప్ప ఏదీ సాధ్యం కాదని అన్నారు. పెద్దగా కష్టం తెలియని వ్యక్తి అని, ఉదయం నుంచి జల్సాగా రెండు మూడు మీటింగ్ లు పెట్టుకుని సాయంత్రానికి పని ముగిస్తాడని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసినప్పుడు కూడా సాయంత్రం ఆరింటికల్లా అంతా అయిపోయేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. శుక్రవారం వస్తే హైదరాబాద్ కోర్టుకు వెళతాడని, అతను ఎలాంటి వ్యక్తి అంటే, అసెంబ్లీకి 24 సార్లు వస్తే కోర్టుకు మాత్రం 240 సార్లు వెళ్లాడని గణాంకాలతో సహా వివరించారు. ఈయనకు చాలా భయం అని, నరేంద్ర మోదీని చూస్తే వెన్నులో వణుకు పుడుతుందని, కేసీఆర్ ను చూస్తే ఉచ్చలు పోసుకుంటాడని వ్యంగ్యం ప్రదర్శించారు. అంతా చిన్నపిల్లాడి తరహా అని తీసిపారేశారు. తప్పులు చేశాడు కాబట్టే వాళ్లకు భయపడుతున్నాడని అన్నారు. ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొనే నైతిక శక్తి తనకుందని చంద్రబాబు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.నసంద్రాన్ని తలపిస్తున్న సభను చూడగానే చంద్రబాబు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. సముద్రంలా కనిపిస్తున్నారని, తన జీవితంలో ఇంతటి జనస్పందన ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇచ్ఛాపురం రాష్ట్రానికి తూర్పు, ఈశాన్యంగా ఉంటుందని, రాష్ట్రానికి పర్ఫెక్ట్ వాస్తు అని పేర్కొన్న చంద్రబాబు, ఇక్కడ పోటీచేస్తున్న అశోక్ టీడీపీ అభ్యర్థుల లిస్టులో మొదట ఉంటాడని, కుప్పంలో పోటీచేస్తున్న తాను చివర 175వ స్థానంలో ఉంటానని వివరించారు.జాబితాలో మొదట, చివర ఉండే ఇద్దరు అభ్యర్థులం ఇప్పుడు ఒకే వేదికపై ఉన్నామని చమత్కరించారు. అంతేకాదు, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు అన్నీ మనమే గెలుస్తున్నామంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేలా మాట్లాడారు. ఇచ్ఛాపురం టీడీపీకి కంచుకోట అని చెప్పారు. ఒక్కసారి తప్ప ఇచ్ఛాపురంలో టీడీపీకి అనేక ఘనవిజయాలు లభించాయని అన్నారు. కుప్పంకు తాను వెళ్లకపోయినా 70 వేలు, 80 వేలు మెజారిటీ వస్తుంటుందని వివరించారు.

Related Posts