Highlights
- డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు హాజరు
- నిజాం కళాశాలలో భారీ ఏర్పాట్లు
ప్రిన్స్ ఆగాఖాన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27 న హైదరాబాద్ రానున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 27న నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే ఆయన డైమండ్ జూబ్లీ ఉత్సవాల కోసం వివిధ శాఖల అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్‌అండ్‌బీ, మెట్రోవాటర్‌బోర్డు, రెవిన్యూ పోలీసు శాఖల ఉన్నతాధికారులు నిజాం కళాశాలలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రానున్న ప్రిన్స్ ఆగాఖాన్ కు ప్రభుత్వం ప్రత్యేక అతిథిగా ప్రభుత్వంఆహ్వానం పలుకుతోంది. ఆయన తాజ్‌ఫలక్‌నుమా ప్యాలె్‌సలో బస చేస్తారు.
ఫిబ్రవరి 27న ఉదయం రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌ను, ఉప ముఖ్యమంత్రి మహ్మమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఆ సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరిగే డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాలొంటారు.
27, 28వ తేదీల్లో నిజాం కళాశాల మైదానంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆదివారం డిప్యూటీ సీఎం మహ్మద్ మహ్మమూద్ అలీ నిజాం కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.